పిల్లలకి కథలంటే ఎంతో ఇష్టం. కథలు వింటూ ఊహాలోకంలో విహరిస్తారు. కథలో అంతర్గతంగా నీతి దాగి ఉంటుంది. విన్న కథనే ఎంతో ఆసక్తితో వినటం వలన అందులోని నీతి వారి మనస్సును హత్తుకు పోయే అవకాశం ఎక్కువే.
మేము మీ కోసం ఆసక్తి కరమైన తెలుగు చిన్న కథలని, స్నేహం గురించి నీతి కథలని సమీకరించి, మీ పిల్లలకి కథలు చెప్పాలన్నప్పుడు వీలుగా మీకు ఇక్కడ అందజేస్తున్నది.
నాలుగు ఆవులు
ఒక ఊరిచివర పచ్చని మైదానం లో నాలుగు ఆవులు ఎంతో సఖ్యం గా , స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసి మెలిసి గుంపు గానే ఉండేవి కాబట్టి, పులి, సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి.
కొంతకాలానికి, ఎదో విషయంలో వాటిమధ్య దెబ్బలాట జరిగి, నాలుగు ఆవులు నాలుగు వైపులా విడి విడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లాయి.
ఇదే సరైన సమయమని, పులి, సింహం పొదల్లో దాక్కుని, ఒకొక్కదాన్ని చంపేశాయి.
నీతి: ఐకమత్యమే బలం.
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box